ఓటర్ల జాబితాను ప్రకటించిన ఎన్నికల కమిషన్...! 1 d ago
TG: తెలంగాణ రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికల ప్రక్రియ రాకముందే అధికారులు ఓటర్ల జాబితాను ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి నివేదికను విడుదల చేసారు. దీనిలో మొత్తం ఓటర్లు 3,35,37,925 మంది ఉన్నారు. అందులో 1,66,41,489 మంది పురుషులు, 1,68,67,735 మంది స్త్రీలు, 2,829 మంది థర్డ్ జండర్ ఉన్నట్లు తెలిపారు. అలాగే యువ ఓటర్లు 5,45,026 మంది ఉండగా, 2,22,091 మంది సీనియర్ ఓటర్లు, 3,591 మంది NRI ఓటర్లు, 5,26,993 PWD ఓటర్లు ఉన్నట్లు తెలిపింది. ఈ ఓటర్ల జాబితాను పంచాయితీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని విడుదల చేసినట్లు తెలిపారు.